వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
- ఈ నెల 26 నుంచి 29 వరకు మోస్తరు వర్షాలు పడే చాన్స్
- వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత ఈనెల 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్,
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే 48 గంటలు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. కాగా, గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.52 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

