హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ) : అర్హులైన నిరుద్యోగ క్రిస్టియన్ మైనారిటీ యువత నుంచి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్‌కు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. 8 నుంచి 10 తరగతి చదివి 21 నుంచి 40 ఏండ్ల వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నది.
వీరికి లైట్ మోటర్ వెహికిల్ లైసెన్స్ ఉండాలని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లోనైతే రూ.2 లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ, వాహన కొనుగోలుకు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నది.