సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

సిద్దిపేట : రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.3 కోట్ల 72 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. పండుగ వాతావరణంలో మంత్రుల సమక్షంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కరోనాతో ఖర్చు పెరిగింది. ఆదాయం తగ్గింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఈ యాసంగిలో భూమికి బరువు పెరిగేంత వడ్ల దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. యాసంగిలో ఎన్నడూ లేనివిధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.

గజ్వేల్‌లో 60 వేల ఎకరాలలో ఎండి పోయి పంటను కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతో కాపాడుకున్నాం. కొడకండ్ల డబుల్ బెడ్ రూం కాలనీకి ప్రధాన రోడ్డు నుంచి బీటీ రోడ్డు, స్ట్రీట్ లైట్స్ వేయిస్తాం. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తామని హామీనిచ్చారు.
కొడకండ్లలోని ఖాళీ రోడ్లను జీపీకి రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. కొడకండ్ల గ్రామంలోని రేషన్ లేని పేద ప్రజలకు రేషన్ కార్డు లు 15 రోజుల్లో అందిస్తాం. అర్హులకు ఆసరా పెన్షన్ లు అందిస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..లబ్ధిదారుల కండ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

లబ్ధిపొందిన వాళ్లే ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మి నట్టే ఉంటుందన్నారు. అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్ వెంటే ప్రజలంతా ఉంటారు. ఆయన అడుగు జాడల్లో మేమందరం నడుస్తామని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలోఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

