దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు

హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్)-2021 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు తేదీని పెంచినట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటిదశ వెబ్ ఆప్షన్లు ఈ నెల 24 వరకు ఇవ్వొచ్చని, 31న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఆగస్టు 1 నుంచి ఐదు వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. రెండోదశ రిజిస్ట్రేషన్లు ఆగస్టు ఒకటినుంచి 9 వరకు చేసుకోవచ్చని, రెండునుంచి 9వ తేదీవరకు వెబ్ఆప్షన్లు ఇవ్వొచ్చని ఆయన వివరించారు. వికలాంగులు, సీఏపీ, ఎన్సీసీ తదితర ప్రత్యేక క్యాటగిరీ అభ్యర్థుల పరిశీలన ఆగస్టు 6న ఉంటుందని, 14న సీట్లు కేటాయిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

