అధికారం కోసం విభేదాలు సృష్టిస్తున్న బీజేపీని నమ్మొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బీజేపీ నాయకులు అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు స్షష్టిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
రంగారెడ్డి : బీజేపీ నాయకులు అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం కందుకూరు మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మతతత్వ పార్టీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, యువకులు ఆ పార్టీ రొంపిలో పడకుండా చూడాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను విస్తరించారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ తదితర పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని అన్నారు. చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఏర్పడడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు భయపడుతున్నారని వివరించారు. ప్రజలకు సీఎం కేసీఆర్ పాలనపై నమ్మకం, విశ్వాసం కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

