హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై రాజీ పడొద్దని ఫ్యాక్టరీలశాఖ డైరెక్టర్ బీ రాజగోపాల్రావు సూచించారు. కెమికల్, ఫార్మా కంపెనీల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీలశాఖ, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో మంగళవారం ‘కెమికల్, ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీల్లో భద్రత’ అంశంపై ఎఫ్‌టీసీసీఐలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ భద్రతలో ప్లానింగ్, డిజైన్, పరికరాల నిర్వహణ, కార్మికులకు శిక్షణ తదితర అంశాలు ఎంతో ప్రధానమని చెప్పారు.
ముడిసరుకు సేకరణ దగ్గర్నుంచి, దాన్ని డిస్పోజల్ చేసేవరకు అన్ని దశల్లో ఫ్యాక్టరీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.