హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కాలేజీ అభివృద్ధికి దొడ్ల డెయిరీ యాజమాన్యం రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. ఈమేరకు దొడ్ల డెయిరీ బోర్డు ఆమోద పత్రాన్ని సోమవారం సంస్థ సీఈవో బీవీకే రెడ్డి విశ్వవిద్యాలయ వీసీ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచిఘోష్కు అందజేశారు.
రూ.4 కోట్లతో కళాశాల భవన మొదటి అంతస్తు ని ర్మాణం, ఎన్హెచ్ 44 నుంచి కళాశాల వర కు సీసీ రోడ్డు, వసతి గృహాల దాకా సీసీ రో డ్డు, భవనాలకు మరమ్మతులు, ప్రాంగణం సుందరీకరణ, మినీ డెయిరీ ప్లాంట్ ఏర్పా టు చేస్తామని బీవీకే రెడ్డి తెలిపారు.