కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పరిశోధన విద్యార్థి గుండా గౌతమ్‌కృష్ణ తేజకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ (పీహెచ్డీ) ప్రదానం చేసింది. డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన ఈ పరిశోధన చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్‌కు చెందిన గౌతమ్‌కృష్ణ తేజ డాక్టర్ ఆర్ సుధాకర్‌గౌడ్ పర్యవేక్షణలో ‘జియో డైనమిక్స్ ఆఫ్ బేరిన్ ఐలాండ్ వాలనిజం, ఇన్సైడ్స్ ఫ్రోమ్ జియో స్పెషల్ టెక్నాలజీ’ అంశంలో పరిశోధన చేశారు. ఈ పరిశోధనలకుగానూ ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగోళశాస్త్ర ప్రొఫెసర్ నగేశ్ ఆధ్వర్యంలో ఇటీవల (ఈ నెల 18న) నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టాను అందజేశారు.
డాక్టరేట్ అందుకున్న గౌతమ్‌కృష్ణ తేజను శనివారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఆరతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అరుణ, ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు అత్తర్ అలీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ హెడ్ డాక్టర్ కవితా తురన్, అధ్యాపకులు డాక్టర్ సబిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ నారాయణ, వివిధ డిపార్ట్మెంట్ల అధ్యాపకులు పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు.