రాజోళి, మే 26: తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సుంకేసుల డ్యామ్ నుంచి పుల్లూ రు వరకు ఇసుకను తరలించొద్దని ఏపీలోని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీలోని కర్నూల్ కలెక్టర్, తెలంగాణలోని గద్వాల్ కలెక్టర్ సూచన మేరకు.. ఇరు రాష్ర్టాలకు చెందిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సుంకేసులడ్యామ్, తూర్పు గార్లపాడు నదితీర ప్రాంతాలను కో డుమూరు ఎమ్మెల్యే దస్తగిరితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడు తూ.. తుంగభద్ర నది నుంచి ఇసుక తరలింపును ఆపాలని ఆదేశించారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గద్వాల జిల్లా అధికారులను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కావాలంటే ఎక్కడో ఒక చోట ర్యాంపులకు అనుమతులు ఇచ్చి తెచ్చుకోవాలని హుకుం జారీచేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతుంటే తెలంగాణ అధికారులు ఏం మాట్లాడలేక తెల్లముఖాలు వేశారు.