అనాథ బాల, బాలికలకు బాల సహాయ కిట్స్ పంపిణీ

హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గురువారం మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. భావితరాలకు అద్భుతమైన పర్యావరణాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. అనాథ బాల, బాలికలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీల్లో బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించడం కోసం రూ. 500 ప్రోత్సాహాక చెక్కులను మంత్రి అందించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

