Teenmar Mallanna | హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పై క్రమశిక్షణా చర్యలకు టీపీసీసీ రంగం సిద్ధం చేస్తున్నది. అందులో భా గంగానే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయంచినట్టు తెలిసింది. ఈ విషయమై టీపీసీసీ అనుబంధ సోషల్ మీడియా గ్రూపులకు కాంగ్రెస్ నేతలే లీకులు వదిలినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనపై మల్లన్న పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడినట్టు పలువురు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కులగణన నివేదికను ఇటీవల మల్లన్న తప్పులతడకగా అభివర్ణించడంతోపాటు సర్వే నివేదికను తగలబెట్టమని మల్లన్న చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఒక కులం పేరుతో సమావేశం నిర్వహించి, ఇతర కులాలను తిట్టడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లా బీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన తీన్మార్ మల్లన్న తనపై లేనిపో ని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మల్లన్న తనను తిడితే స్వాగతిస్తానని, అయితే కులాన్ని తిట్టడం సరైనది కాదని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఇష్టం లే కుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చునని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. మల్లన్నకు ఇతర కులాలపై మాట్లాడే హక్కులేదని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘం, అగ్రవర్ణ పేదల సమితి ప్రతినిధులు మంగళవారం డీజీపీ జితేందర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరకాల, ఫిబ్రవరి 4: రాజ్యాంగబద్ధంగా అగ్రవర్ణ పేదలకు కల్పించిన రిజర్వేషన్లను ర ద్దు చేయాలని డిమాండ్ చేయడం అవగాహ నా రాహిత్యమని ఓసీ సంఘాల జేఏసీ నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, మాడుగుల పాపిరెడ్డి విమర్శించారు. ఇటీవల తీన్మార్ మల్లన్న ఓ సభలో చేసిన వ్యాఖ్యలపై ఓసీ సంఘాల నాయకులు మంగళవారం హనుమకొండ జిల్లా పరకాలలోని అమరథామంలో నిరసన వ్యక్తంచేశారు.