హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదంటూ కేవీపీ సతీమణి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందట బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న డైమండ్ నెక్లెస్ ధరించి సునీత ఓ ఫంక్షన్కు వెళ్లారు. ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే నెక్లస్ కనిపించలేదంటూ ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.