ఆమనగల్లో పద్మనాయకుల రేఖాచిత్రాలు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మం డ లం రాంనూతుల శివారులోని అనంతగిరి గుట్టల్లోని గుహల్లో 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల రేఖాచిత్రాలు (పెట్రోగ్లిఫ్స్)ఉన్నాయని చరిత్రకారుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం రాంనూతుల శివారులోని అనంతగిరి గుట్టల్లోని గుహల్లో 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల రేఖాచిత్రాలు (పెట్రోగ్లిఫ్స్)ఉన్నాయని చరిత్రకారుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు. ఆమనగల్ దగ్గర అయ్యసాగర్ వీరభద్రస్వామి ఆలయానికి సమీపంలోని బ్రహ్మదేవునిగుట్ట, విష్ణుదేవునిగుట్ట(అనంతగిరి)లను పరిశీలిచినప్పుడు ఈ పెట్రోగ్లిఫ్స్ కనిపించినట్టు పేర్కొన్నారు.
ఇవి ఉన్న గుహలకు స్థానిక గిరిజనులు సున్నం పూశారని, దీంతో చరిత్ర పూర్వయుగపు ఆదిమమానవులు వేసిన ఎరుపు రంగు బొమ్మలు కనుమరుగైనట్టు చెప్పారు. అనంతగిరి గుహల్లో ప్రస్తుతం మూడుచోట్ల పెట్రోగ్లిఫ్స్ కనిపిస్తున్నాయని, వాటిలో ప్రధాన గుహ, నైరుతి గుహ, గుండు పాదం ముఖ్యమైనవి అని వివరించారు. తూర్పునకు అభిముఖంగా ఉన్న పడగరాయి కింది గుహలో గుర్రం, వినాయకుల రేఖాచిత్రాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

