మరో 1,000 గ్రామీణ ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం
Dhoopa Deepa Naivedyam | గ్రామీణ ప్రాంతాల్లోని మరో 1,000 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరు
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని మరో 1,000 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరు కాగా, ఆలయ నిర్వాహకుల నుంచి స్పందన రాలేదు. దీంతో జీహెచ్ఎంసీకి మంజూరైన 1,588 ఆలయాల్లో నుంచి 1,000 ఆలయాలను తగ్గించి ఈ మేరకు గ్రామీణ ప్రాంత ఆలయాలకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 3,645 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకం అమలవుతుండగా, ఇటీవలే ప్రభుత్వం కొత్తగా మరో 1,160 ఆలయాలకు మంజూరు చేసింది. ఇది కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 ఆలయాలకు కూడా ఈ పథకాన్ని మంజూరుచేసి దరఖాస్తులు ఆహ్వానించగా, ఆలయ నిర్వాహకుల నుంచి సరియైన స్పందన రాలేదు. ధూప దీప నైవేధ్య పథకం కింద ఆదాయం లేని ఆలయాలకు ప్రతి నెలా రూ. 6,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఇందులో రూ. 2,000 ధూప దీప నైవేద్యాలకు, మిగిలిన రూ. 4,000 అర్చకులకు చెందుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

