ధరణికి నేటితో రెండేండ్లు పూర్తి.. 26 లక్షలకు పైగా లావాదేవీలు
Dharani Portal | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేండ్లు పూర్తవుతుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేండ్లు పూర్తవుతుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక సిటిజెన్ ఫ్రెండ్లి ఆన్లైన్ పోర్టల్. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలన లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ధరణి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి ప్రారంభంతో రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్లను ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. రిజిస్ట్రేషన్ల అనంతరం తమ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు కూడా జరిగేలా చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలు జనరేట్ కావడంతో పాటు దీనికి సంబంధించిన సమాచారం ఎస్.ఎం.ఎస్ ద్వారా సిటిజన్లకు అందుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజుల్లోగా 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ అవుతుంది.
నేటి వరకు ధరణి పోర్టల్‌కు 9 .16 కోట్ల హిట్స్ వచ్చాయి. 26 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వ్యవసాయ సంబంధిత లావాదేవీలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నసమస్యలు కూడా ధరణిలో పరిష్కారమవుతున్నాయి. గతంలో 2.97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి ప్రారంభంతో వీటికి పరిష్కారం లభించింది. భూ సంబంధిత 3.16 వివాదాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పటివరకు 11 .24 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2 .81 లక్షల గిఫ్ట్ డీడ్ లను రిజిస్ట్రేషన్లు చేసింది. లక్షా 80 వేల మందికి సక్సేషన్ రైట్స్ లను ధరణి ద్వారా అందించింది.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు తమ భూములకు రక్షణ నెలకొన్నదని రైతులు సంతోషంతో ఉన్నారు. రాష్ట్రంలో 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రైతులందరూ ఏవిధమైన సమస్యలు లేకుండా రైతు బంధు పథకాన్ని పొందుతున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా సులభంగా బదలాయింపునకు కూడా ఈ ధరణిలో వెసులుబాటు కల్పించారు. దీంతో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించినట్టుగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

