హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించినట్టు డీజీపీ బీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఉద్యోగోన్నతులు పొందిన 35 మంది డీఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ (పర్సనల్) డీఎస్ చౌహాన్, మల్టీ జోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే ఐజీ పీ రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.