హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : పోలీసులు వృత్తితోపాటు ఆయా విభాగాల పోటీల్లో పాల్గొని, ప్రతిభ చాటాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా గురువారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీస్ సిబ్బందికి గురువారం ఆయన నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ.. వ్యాసరచన పోటీలు రెండు విభాగాలలో జరిగాయని తెలిపారు. ఏఎస్ఐ, ఏఅర్ఎస్ఐలు, కిందిస్థాయి సిబ్బంది మొదటి క్యాటగిరీగా.. ఎస్సై, ఆర్ఎస్ఐలు పైస్థాయి సిబ్బంది రెండో క్యాటగిరీగా జరిగిన పోటీల్లో 12 మందిని విజేతలుగా నిర్ణయించామని వెల్లడించారు. కార్యక్రమంలో పోలీసు సంక్షేమ విభాగపు ఐజీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.