ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వండి డీజీపీ జితేందర్
పోలీసులకు సంబంధించి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు కమిషనర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు ప్రాధాన్యమివ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : పోలీసులకు సంబంధించి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు కమిషనర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు ప్రాధాన్యమివ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వారితో డీజీపీ ఆఫీసులో జితేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు చేపడుతానని వెల్లడించారు.
హిస్టరీ షీట్లు సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్ జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిషరించాలని తెలిపారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్టేషన్ హౌస్ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

