Prajavani | ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి.. డీజీపీ ఆదేశం
Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఆయా జిల్లాలు, కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు.
పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని అధికారులను డీజీపీ జితేందర్ ఆదేశించారు. పోలీసు కమీషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు. తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని తెలియజేశారు. హిస్టరీ షీట్లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని, మెరుగ్గా శాంతి భద్రతల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యాన్ని వివరించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని డిజిపి సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అందుకు అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీపీలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్), జి. సుధీర్ బాబు (రాచకొండ), ఐజిపిలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1), వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II), ఎం రమేష్, కె. రమేష్ నాయుడు, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

