హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్ఎం)కు ఎంపికైన తె లంగాణకు చెందిన హోంగార్డులను డీజీ స్వాతిలక్రా సోమవారం అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
వారిలో మహేశ్వరం హోంగార్డు మంత్రి ఈశ్వరయ్య, గ్రేహౌండ్స్ నుంచి మేడిపల్లి యాదాద్రి, కోమటి లక్ష్మణ్, కల్లెమియా అయిలయ్య ఉన్నారు. పోలీసు శాఖకు కీర్తిని తీసుకొచ్చేలా ఇదే రెట్టింపు ఉత్సాహంతో చేయాలని స్వాతిలక్రా ఆకాంక్షించారు.