హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఆక్టోపస్ సిబ్బంది వ్యూహాత్మక సామర్థ్యం పెంచుకోవాలని తెలంగాణ ఆపరేషన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ డీజీ డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రంలో మాక్ ఎక్సర్సైజ్ల ద్వారా నేర్చుకున్న అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఆక్టోపస్‌కు చెందిన 6 ఎస్డబ్ల్యూఏటీ బృందాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని అత్యంత కీలక, సున్నిత ప్రాంతాలు, ముఖ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 18 మాక్ ఎక్సర్‌సైజ్‌లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.