జీవాలకు మెరుగైన వైద్యం అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి : మంత్రి తలసాని
జీవాలకు మెరుగైన వైద్యం | జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నది. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్థకశాఖకు ఎనలేని గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ : జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్థకశాఖకు ఎనలేని గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
గతంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలాన్ని మరో ఏడాది వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు.
జీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇప్పటికే 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న పశువైద్యశాలలను గుర్తించి తొలి విడుతలో 500కుపైగా వైద్యశాలల ఆధునీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అన్ని పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేయడంతోపాటు శాఖకు చెందిన ఖాళీస్థలాల్లో గడ్డి పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు.
ఉపాధిహామీ పథకం కింద గొర్రెలు, పశువుల పెంపకందారులకు ఉచితంగా షెడ్లను నిర్మించి ఇస్తున్నట్లు గుర్తుచేశారు. పశుసంవర్థకశాఖకు భారీగా నిధులు కేటాయించి శాఖ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ర్రైతుల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

