MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను విచారించాల్సి అవసరం ఉన్నదని పేర్కొన్నది.
సీబీఐ పిటిషన్పై శుక్రవారం నాడు విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు.. కవితను జైలులో విచారించేందుకు అనుమతినిచ్చింది. అయితే విచారణకు వచ్చే ఒక్క రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది. విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని.. ఇతర నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది.