MLC Kavitha | సౌకర్యాలు కల్పించడం లేదు.. జైలు అధికారులపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు
జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు.
- అధికారులు కోర్టు ఆదేశాలు పాటించట్లే
- కవిత తరపు న్యాయవాదుల ఫిర్యాదు
- సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశం
MLC Kavitha | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. జైలులో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను న్యాయస్థానం కల్పించింది. కవితను తీహార్ జైలుకు తరలించే ముందే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను తీహార్ జైలు అధికారులకు అందించామని, అయినా కవితకు జైలులో ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావు కోర్టు దష్టికి తీసుకెళ్లారు. కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులకు కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా పరిశీలించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడంలేదో శుక్రవారం సమాధానం చెప్పాలని జైలు అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

