KTR | దీక్షా దివస్‌ను దసరా, దీపావళి తరహాలో జరుపుకోవాలి.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
KTR | దీక్షా దివస్ అంటే ఓ పండుగ, ఓ ప్రతిజ్ఞ అని.. దీక్ష దీవస్ అంటే కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని.. ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
KTR | దీక్షా దివస్ అంటే ఓ పండుగ, ఓ ప్రతిజ్ఞ అని.. దీక్ష దీవస్ అంటే కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని.. ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆ పండుగలో ఉన్న స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ పండగలు చేసుకున్నట్లుగానే.. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ సోయికి సాన పెట్టుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాలని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దీక్షా దివాస్ అంటే ఒక సందర్భం.. ఒక సంఘటన కాదని.. 60 సంవత్సరాల తెలంగాణ చరిత్రను తలుచుకొని, తెలంగాణ కోసం మరోసారి పునరంకితం కావాల్సిన రోజు అన్నారు.
ఆగస్టు 15 రోజు జాతీయ జెండా ఎగరవేసి తెల్లదొరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ల దుర్మార్గాలను గుర్తుచేసుకున్నట్లుగానే.. నవంబర్ 29 దీక్షా దివస్ నాడు, డిసెంబర్ 9 విజయ్ దివస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట తప్పి 1,000 మందికి పైగా బిడ్డల చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని, లేలేత పిల్లల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ ద్రోహాన్ని గుర్తుంచుకోవాల్సిన రోజన్నారు. మరోసారి రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, కొమురం భీమ్, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ వంటి వీరులందరి స్ఫూర్తితో ఈ తెలంగాణకు దక్కిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ.. ఢిల్లీ సామంత రాజుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం మరోసారి ఉందన్నారు.
16 మంది ఎంపీలను జాతీయ పార్టీలకు కట్టబెడితే తెలంగాణ గొంతుక పార్లమెంటులో మూగబోయింది అని ఉద్యమ పార్టీగా, తెలంగాణ కడుపున పుట్టిన పార్టీ, తెలంగాణను కడుపులో పెట్టుకునే పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. అలాంటి పార్టీ వల్లనే తెలంగాణకు బలం వస్తుందని, కేసీఆర్ గళంతోనే తెలంగాణ మరోసారి నిలబడుతుంది అన్నారు. కేసీఆర్ మాట, మౌనం రెండు సంచలనమే అని, రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కేసీఆర్ మాట లేకుండా రాజకీయం నడవడం లేదని, అంతటి బలమైన ముద్ర కేసీఆర్‌దని అన్నారు. మాయ మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ తెలంగాణను కాపాడుకుందామని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- Diwali
- dussehra
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

