జీవో 46లో అనేక తప్పులు.. 5వ పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నది
కాంగ్రెస్ సర్కారు ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితం
- అది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎలా సిఫారసు చేసింది?
- కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలు
- రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని చైర్మన్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవో నంబర్ 46లో అనేక తప్పులున్నాయని వివరించారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన వార్డులు, సర్పంచ్ స్థానాలను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించినట్టు జీవో46లోని 5వ పాయింట్ చెప్తున్నదని వివరించారు.
ఇది పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని కమిషన్ చైర్మన్ మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల శాతాన్ని మాత్రమే నిర్ధారించేందుకు 2024లో జీవో 49 ద్వారా డెడికేటెడ్ కమిషన్ను నియమించారని గుర్తుచేశారు. డెడికేటెడ్ కమిషన్ పరిధి కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితమని వివరించారు. మరి డెడికేటెడ్ కమిషన్ తన అధికార పరిధిని దాటి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సైతం సిఫారసు చేసిందా? అని నిలదీశారు. ప్రభుత్వం దీనిపై స్పష్టతనివ్వాలని అన్నారు. జీవోను ఉపసంహరించుకోవాలని, బీసీలకు న్యాయం చేసేందుకు మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

