తీరు మారని ఆర్ఎంసీ
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాపై చర్చించేందుకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తీరు ఏమాత్రం మారలేదు.
- తెలంగాణ సంతకం చేయకున్నా కృష్ణా బోర్డుకు ఏకపక్ష నివేదిక
- శ్రీశైలం, సాగర్‌పై ఏకాభిప్రాయం సాధించినట్టు ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాపై చర్చించేందుకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తీరు ఏమాత్రం మారలేదు. ఆది నుంచీ కేంద్ర ప్రభు త్వ ఆదేశాలనే శిరోధార్యంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంసీ.. తెలంగాణ అభిప్రాయాలను ఏమాత్రం పొందుపరచకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది.
సీడబ్ల్యూసీ రూపొందించిన తాజా ముసాయిదాను అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ తేల్చిచెప్పినా, ఆ నివేదికపై సంతకం చేయకున్నా ఏకాభిప్రాయం సాధించినట్టు ఆర్ఎంసీ తన నివేదికను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సమర్పించింది. రూల్‌కర్వ్‌కు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయంటూనే.. మరోవైపు సంతకాలు చేయించలేకపోయామని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్‌కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. దానిపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకునేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అందజేసింది.
ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ రెండు రాష్ర్టాల ఈఎన్సీలు, జెన్కో సీఈలతో ప్రత్యేకంగా ఆర్ఎంసీని ఏర్పాటు చేసింది. ముసాయిదాలోని ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్‌కర్వ్ తదితర అంశాలపై ఇరు రాష్ర్టాలతో ఆర్ఎంసీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చించింది. సీడబ్ల్యూసీ ప్రతిపాదనలపై ఆది నుంచే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆర్ఎంసీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్ అవార్డు మేరకే రూల్‌కర్వ్ ఉండాలని స్పష్టం చేస్తున్నది. అయినప్పటికీ ఇరు రాష్ర్టాలు రూల్‌కర్వ్‌కు అంగీకరించాయని ఆర్ఎంసీ కన్వీనర్ ఇటీవల ఏకపక్షంగా మీడియా ఎదుట ప్రకటించారు. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి బోర్డుకు, కేంద్ర జలసంఘానికి, జలశక్తిశాఖకు లేఖలు రాసింది. శ్రీశైలం ప్రాజెక్టు ముమ్మాటికీ జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టేనని పునరుద్ఘాటించింది.
50ః50 నిష్పత్తిలో విద్యుత్తు ఉత్పత్తికి అంగీకరించబోమని స్పష్టం చేసింది. క్యారీ ఓవర్ స్టోరేజ్, వరదజలాల మళ్లింపు తదితర అంశాలపై మొదటి నుంచి వినిపిస్తున్న వాదనలకే కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే తుది సమావేశానికి తెలంగాణ హాజరుకాలేదు. ఆర్ఎంసీ నివేదికపై సంతకం కూడా చేయలేదు. అయినా ఇరు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు ఆర్ఎంసీ నివేదించడంపై తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

