నెల రోజుల్లో 8 సెట్లు
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్‌తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్‌సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), పీజీఈసెట్, లాసెట్, ఐసెట్, పీఈసెట్ పరీక్షలు ఈ నెలలోనే నిర్వహించనున్నారు.
- మే 10 నుంచి జూన్ 10 వరకు
- పరీక్షలు ముగియగానే ఫలితాలు
- జూన్, జూలైలో సీట్ల భర్తీ ప్రక్రియ
- 2024 పోస్టుల కోసం 7 పరీక్షలు
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్‌తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్‌సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), పీజీఈసెట్, లాసెట్, ఐసెట్, పీఈసెట్ పరీక్షలు ఈ నెలలోనే నిర్వహించనున్నారు. దీంతో ఈ నెలను ప్రవేశాల మాసంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించి, జూన్, జూలై మాసాల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపడుతారు. ఈ నేపథ్యంలో పరీక్షల కౌన్సెలింగ్ షెడ్యూళ్లను రూపొందించడంపై ఉన్నత విద్యామండలి అధికారులు దృష్టిసారించనున్నారు.
సకాలంలో తరగతులు
కరోనాతో గత రెండేండ్లుగా ప్రవేశ పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండగా, సీట్ల భర్తీ ఆలస్యమవుతున్నది. దీని ప్రభావం సెమిస్టర్ పరీక్షలపై పడి విద్యాసంవత్సరాన్ని పొడగించాల్సిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు ముందుగానే షెడ్యూళ్లను ప్రకటించడంతో ఈ ఏడాది తరగతులు సకాలంలో ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కోర్సులు పూర్తిచేసిన వారికి అనువైన సమయంలోనే సర్టిఫికెట్లు చేతికందనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Entrance exams
- Iset
- LASET
- Mset
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

