కాంగ్రెస్, బీజేపీవి రాజకీయ డ్రామాలు
తీవ్ర కరువు కాటకాలతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
- కరువు సహాయంపై అమిత్‌షా ఎందుకు నోరు విప్పలేదు?
- ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే సీబీఐ, ఈడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?
- నటులు, పెట్టుబడిదారులను కలిసిన అమిత్ షా రైతులను ఎందుకు కలువలేదు?
- ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తీవ్ర కరువు కాటకాలతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 2014 నుంచి కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో వ్యవసాయం చేసిన రైతన్నలు, ఇవాళ మళ్లీ నీళ్లు లేక, గ్రౌండ్‌వాటర్ పాతాళానికి పడిపోవడంతో బోర్లపై ఆధారపడే దుస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్ నినోతో కరువు రాబోతున్నదని వాతావరణ శాఖ హెచ్చరించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాయత్తం కాలేదని, పక రాష్ట్రం కంటే దారుణమైన పరిస్థితుల్లోకి తెలంగాణను నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు తెలంగాణ పొలాలు ఎండిపోతుంటే, మరోవైపు 750 టీఎంసీల గోదావరి నీళ్లు, 250 టీఎంసీల కృష్ణా నీళ్లు (మొత్తం 1,000 టీఎంసీలు) ఆంధ్రాకు తరలిపోతున్నా రేవంత్ సర్కార్ కండ్లు అప్పగించి చేస్తున్నదని విమర్శించారు. కన్నెపల్లి వద్ద రూ.10 కోట్లతో రబ్బర్ డ్యామ్ కడితే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చని, కానీ,ఆ సోయి కూడా ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ‘కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్ వచ్చి భాగ్యలక్ష్మి గుడికి పోయారు, పాదయాత్రలు చేశారు, సినిమా యాక్టర్లను కలిశారు కానీ, తెలంగాణను పట్టిపీడిస్తున్న కరువు, తాగునీరు, సాగునీటి కష్టాల గురించి ఒకమాట కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం, బాధ్యతారాహిత్యమ’ని దుయ్యబట్టారు.
ఆర్ఆర్ ట్యాక్స్ డ్రామాలు
తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ, అమిత్ షా ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేయడం తప్ప తమ చేతిలో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో విచారణ ఎందుకు జరిపించడం లేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఇది గల్లీల కుస్తీ- ఢిల్లీల దోస్తీ కాకపోతే మరేందని నిలదీశారు. ఢిల్లీకి పోయి రాజకీయ ధర్నాలు చేయడానికి సమయం ఉంటుంది కానీ, కేంద్ర వ్యవసాయ, హోం శాఖ మంత్రులను కలిసి రూ.20,000 కోట్ల కరువు ప్యాకేజీ సాధించడానికి రేవంత్‌రెడ్డికి మనసొప్పదా? సమయం లేదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల నగదుతో దొరికిన రేవంత్‌రెడ్డి, ఇవాళ ఢిల్లీలో ఓటు చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధర్నాలు, పాదయాత్రలు చేస్తే అనుమతులిస్తున్న పోలీసు శాఖ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన, పబ్లిక్ హియరింగ్ల్లో పాల్గొనడానికి పోతుంటే ముందస్తు అరెస్టులు చేయడం ఏందని ప్రశ్నించారు.
కరువు నిధులు విడుదల చేయాలి
కన్నెపల్లి వద్ద తక్షణమే రబ్బర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, తాగునీటి సమస్యలు తీర్చాలని దాసోజు శ్రవణ్ కోరారు. గోదావరి, కృష్ణా జలాల్లో 1,000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవ్వడానికి గల కారణాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా చేసిన ఆర్ఆర్ టాక్స్ ఆరోపణలు నిజమైతే వెంటనే సీబీఐ లేదా ఈడీ విచారణకు ఆదేశించాలని, లేకపోతే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ ముందస్తు అరెస్టులు నిలిపివేసి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హకును కాపాడాలని కోరారు. ఎన్నిసారు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినా తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి స్రవంతీరెడ్డి, తొట్ల స్వామియాదవ్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

