గులాబీ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్
Minister Ktr | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు శ్రవణ్ తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

