నీటి నుంచి ఐటీ దాకా.. అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం!
రేవంత్రెడ్డి తెలంగాణ సీఎమ్మా? లేక ఏపీ సీఎం చప్రాసియా? తెలియడం లేదని, ఆయన పాలనలో కాళేశ్వరం నీటి నుంచి ఐటీ పరిశ్రమల వరకు అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం చేస్తున్నారని, దీంతో రేవంత్ పాలనలో రాష్ట్ర ఐటీ, ఫార్మా రంగాలు పతనావస్థకు చేరుకుంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
- రేవంత్ పాలనలో పతనావస్థలో ఐటీ, ఫార్మా రంగాలు
- కాంగ్రెస్ విధానాలతో రాష్ర్టానికి తీవ్ర నష్టం: దాసోజుశ్రవణ్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి తెలంగాణ సీఎమ్మా? లేక ఏపీ సీఎం చప్రాసియా? తెలియడం లేదని, ఆయన పాలనలో కాళేశ్వరం నీటి నుంచి ఐటీ పరిశ్రమల వరకు అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం చేస్తున్నారని, దీంతో రేవంత్ పాలనలో రాష్ట్ర ఐటీ, ఫార్మా రంగాలు పతనావస్థకు చేరుకుంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రం నష్టపోతున్నదని, హైదరాబాద్కు రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో కేటీఆర్ హయాంలో రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్న హైదరాబాద్, నేడు రేవంత్రెడ్డి పాలనలో దిగజారిపోతున్నదని పేరొన్నారు. లక్షలాది ఉద్యోగాలను సృష్టించిన గత ప్రభుత్వానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే సుమారు లక్షా 20 వేల ఉద్యోగాలను కోల్పోయేలా చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ను వదిలి కాగ్నిజెంట్ సంస్థ విశాఖకు తరలిపోవడం రాష్ట్రానికి పెద్ద ఎదురుదెబ్బ అని పేరొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రేవంత్ తన ఫ్యామిలీ రైజింగ్, రియల్ ఎస్టేట్ దందాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. దావోస్ వెళ్లి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్రెడ్డి, తెచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యకమంలో బీఆర్ఎస్ నేతలు ముఖీబ్ చాందా, నిఖిల్ ఐనేని, లక్ష్మినరసింహారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

