జగిత్యాల, డిసెంబర్ 14 : జగిత్యాల మండలం లక్ష్మీపూర్ బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో రేవంత్‌రెడ్డి పాటకు విద్యార్థినులతో టీచర్లు డ్యాన్సులు వేయించి అత్యుత్సాహం ప్రదర్శించారు. శనివారం ‘న్యూ కామన్ డైట్’ ప్రారంభోత్సవం నిర్వహించగా, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న’ పాటకు బాలికలతో నృత్యాలు చేయించారు. దీనిపై తల్లిదండ్రులు, లక్ష్మీపూర్ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హడావుడిలో చూసుకోలేదు..
న్యూ కామన్ డైట్ ప్రోగ్రాం విషయాలు సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నా. విద్యార్థినులు వారే పాటను డౌన్లోడ్ చేసుకుని డ్యాన్స్ చేశారు. ప్రోగ్రాం హడావుడి వల్ల గమనించలేదు. చూస్తే ఈ డ్యాన్సులు, పాటలు వద్దనే దాన్ని.
– చైతన్యలత, ఇన్చార్జి ప్రిన్సిపాల్