Rajanarasimha | హోటల్స్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: దామోదర రాజనరసింహ
Food adulterated | ఆహారం కల్తీ(Food adulterated) చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.
హైదరాబాద్ : ఆహారం కల్తీ(Food adulterated) చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజెడ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిలర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్లు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు సూచించారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామన్నారు. హోటల్స్(Hotels) యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

