ఏసీబీకి చిక్కిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
- ఇంజక్షన్ ఆర్డర్‌పై కౌంటర్ దాఖలుకు 50 వేలు డిమాండ్
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 22 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… రాంనగర్‌కు చెందిన సుదర్శన్‌కు మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడలో ఉన్న రైస్‌మిల్ స్థలం ఎదుట ఉన్న ప్రభుత్వ భూమిలో పక్కన ఉన్న వ్యక్తి ప్రహరీని నిర్మించారు. ఆ ప్రహరీని గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే ప్రహరీని నిర్మించిన వ్యక్తి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని, ప్రహరీని మళ్లీ నిర్మించాడు. కోర్టును ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసేందుకు మున్సిపాలిటీ తరుపున కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను సుదర్శన్‌ను కలిశారు. ఇందుకు రూ.50లు చెల్లించాలని కమిషనర్ సుదర్శన్‌ను డిమాండ్ చేశారు.
ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొదట ఆయన కమిషనర్‌కు రూ.20వేలు ముట్ట చెప్పాడు. మిగతా రూ.30వేలు కూడా ఇస్తేనే కౌంటర్ దాఖలు చేస్తామని డిమాండ్‌కు దిగారు. దీంతో సుదర్శన్ రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు సోమవారం రసాయనాలు వినియోగించిన రూ.500 నోట్లను సుదర్శన్ కమిషనర్‌కు అందజేశారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు రం గం ప్రవేశం చేసి, కమిషనర్‌ను పట్టుకున్నా రు. అతడి చేతులకు రసాయనిక పరీక్షలు నిర్వహించి, లంచం డబ్బులు తీసుకున్న ట్టు తేలింది. డబ్బులను రికవరీ చేసి, నాం పల్లిలోని ఏసీబీ కేసులను విచారించే కోర్టు అడిషనల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

