ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1,500 మందికి దళితబంధు
ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొన్నది.
- రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో మొత్తం 1,77,000 మందికి లబ్ధి
- తొలి దశలో 500 మందికి వెంటనే
- తొలి దశ లబ్ధిదారులు 59,000
- ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని విస్తరిస్తూ మంత్రి మండలి నిర్ణయం
- గత ఏడాదిలో నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొన్నది. తొలిదశలో 500 మంది అర్హులైన లబ్ధిదారులను తక్షణం ఎంపికచేసి దళితబంధు పథకాన్ని అమలుచేస్తారు.
శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,77,000 మందికి దళితబంధు వర్తించనున్నది. తొలి దశలో 500 మంది చొప్పున తక్షణం 59 వేల మందికి దళితబంధు అందిస్తారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

