హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి మృతి దేశంలోని దళిత, ఆదివాసీలకు తీరని లోటని దళిత్ రైట్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య, బీ వెంకట్, రామచంద్ర డోమ్, వీఎస్ నిర్మల్, ధీరేంద్రఝా, గుల్జర్సింగ్ గోరియా, కర్నాల్సింగ్, బీనా పల్లికరి, సాయిబాలాజీ, విక్రమ్ సింగ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత, ఆదివాసీల హక్కుల కోసం ఏచూరి చేసిన కృషిని స్మరించుకున్నారు.