Huzurabad | ధర్మపురి అరవింద్‌పై భగ్గుమన్న దళిత సంఘాలు
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్లే హుజురాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోమవారం హుజూరాబాద్‌లో ఏర్పా

కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్లే హుజురాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోమవారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు.
హుజూరాబాద్‌కు చెందిన ఉద్యమకారుడు, దళిత నేత బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావవం నుంచి శ్రీనివాస్ పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. 1990 నుంచే బండ శ్రీనివాస్ రాకీయాల్లో ఉన్నారని.. టీఆర్ఎస్ పార్టీలో ఆయన కంటే ఈటల రాజేందర్ చాలా జూనియర్ అని చెప్పారు. శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే సామాజిక సేవలో ఉన్నారని తెలిపారు. ఈటల రాజేందర్‌లా బండ శ్రీనివాస్ గులాబీ పార్టీకి వెన్నుపోటు పొడవలేదన్నారు. కుట్రలు చేయలేదన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారని దళిత నాయకులు స్పష్టం చేశారు.
బండ శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీకి, దళిత బంధు ద్వారా దళితులు లబ్ది పొందడం ఇష్టం లేదన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి కేంద్రం ఏ ఒక్క పథకమైనా అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. బీజేపీ దళితులను ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేసి.. తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టి గెలిచాడన్న విషయం మరిచిపోవద్దని దళిత సంఘాల నాయకులు సూచించారు.
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, దళితుడైన రామస్వామిపై కక్షకట్టి రాజీనామా చేయించి వేధించిన చరిత్ర ఈటలది అని గుర్తు చేశారు. ఈటల ఏ దళిత నాయకుడిని ఎదగనివ్వలేదు, నిర్దాక్షిణ్యంగా అణచివేసాడు అని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ ఇప్పటికైనా ప్రేలాపనలు మానుకోవాలి.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు అని దళిత సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో కనుమళ్ల గణపతి, మొలుగూరి ప్రభాకర్, ఇల్లందుల శ్రీనివాస్, పోచంపల్లి సదయ్య, కనకం రాజ్ కుమార్, కొత్తూరి మొగిలి, దీవెన్, శనిగరం సతీష్, మొలుగు సాంబరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

