హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ సంఘం తెలంగాణ(పీఎస్‌హెచ్‌ఎంఏ టీజీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డీ మురళీధర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రచ్చ మురళి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
గౌరవాధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా అంకం నరేశ్, కొడపర్తి సోమయ్య, బత్తుల సదానందం, బీ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా మోహన్, గాలయ్య, హన్మంతరావు, లక్ష్మణస్వామి, రాజశేఖర్‌రెడ్డి, అంజయ్య, రమేశ్‌నాయక్, నర్సింగరావు, చంద్రశేఖర్, కిషన్, మహిళా ఉపాధ్యక్షులుగా లక్ష్మీతులసి, కమల, భాగ్యరేఖతోపాటు మరికొందరికి రాష్ట్ర కార్యవర్గంలో చోటుకల్పించారు.