D.Ed Counselling | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడత షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కన్వీనర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 2 నుంచి 4 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 9న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు 13 వరకు ఫీజు చెల్లించాలని, 16న రిపోర్ట్ చేయాలని సూచించారు.