Cyber Crime | నీ కొడుకును అరెస్టు చేశాం ముంబై రండి.. రోజుకో ఐడియాతో సైబర్ నేరగాళ్ల పంజా!
నీ కొడుకును అరెస్ట్ చే శాం.. మేం ఫలానా పోలీసులం.. మీ బిడ్డను వదిలి పెట్టాలంటే వెంటనే ముంబై రావాలి.. ఇదీ సైబర్ నేరగాళ్ల నయా దందా.
- తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరికి కాల్స్
Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 24 (నమస్తే తెలంగాణ): నీ కొడుకును అరెస్ట్ చే శాం.. మేం ఫలానా పోలీసులం.. మీ బిడ్డను వదిలి పెట్టాలంటే వెంటనే ముంబై రావాలి.. ఇదీ సైబర్ నేరగాళ్ల నయా దందా. మీకు ఎంత మంది పిల్లలు.. ఏమి చేస్తున్నారు.. అంటూ అచ్చం పోలీసులు మాట్లాడినట్టే వాట్సాప్ కాల్ చేస్తారు. ఈ తరహా ఫోన్ కాల్స్ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి రావడం గమనార్హం. ‘హలో మీకు పిల్లలెంత మంది.. ఏం చేస్తున్నారు.’ అంటూ హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌కాల్ వచ్చింది. ‘మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.’ అని అనగానే ‘హా మేము అమెరికా నుంచి మాట్లాడుతున్నాం.’ అనడంతో కంగుతినడం అంబర్‌పేట వ్యక్తి వంతయింది. రాజేంద్రనగర్‌లో ఉండే మరొకరికి ఇలాంటిదే కాల్ వచ్చింది. ‘ముగ్గురు పిల్లలను అరెస్ట్ చేశాం.. అందులో మీ కొడుకు ఉన్నాడు. మీ ఫోన్ నంబర్ ఇ చ్చాడు. వెంటనే మీరు ఢిల్లీకి రావాలి’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. ‘అరేభాయ్ నా పిల్లలు ఎల్కేజీ చదువుతున్నారు’ అంటూ బాధితుడు చెప్పడంతోనే ఫోన్ కట్ చేశాడు. ఈ రెండు కాల్స్ కూడా +92 కోడ్ నంబర్‌తో వాట్సఫ్ కాల్స్ వచ్చాయి.
ఈ చలాన్, ఐటీ పేరుతో సైబర్ వల
ఈ చలాన్, ఇన్‌కం ట్యాక్స్ పేరుతో లింక్‌లు పంపి సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే అసలైన్ వెబ్సైట్లు https://echallan.p arivahan.gov.in, https://echalla n.tspolice.gov.in ఇవేనని సూచించారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి మేసేజ్ పంపినట్టు నకిలీ లింక్‌లు పంపే ప్రమాదమూ ఉన్నదని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

