కలెక్టర్లకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశం
హైదరాబాద్, మార్చి 12 : జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి సమగ్ర వివరాలు అందించాలని స్పష్టం చేశారు. ఉద్యోగంలో ఎప్పుడు చేరారు, చివరగా పనిచేసిన ప్రాంతం, ఆరోపణలు వంటి పూర్తి వివరాలను పొందుపరుచాలని తెలిపారు.