Heavy Rains | వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. పెద్దవాగు వరద పరిస్థితిపై సీఎస్ సమీక్ష..
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆ కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆ కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ పునరావాస చర్యలపై సమీక్షించారు. డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ కార్యదర్శి రాహుల్ బొజ్జ హాజరయ్యారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాపాయం కలుగకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు.
పెద్దవాగు మూడుగేట్లు ఎత్తడంతో సమీపంలోని నాలుగు గ్రామాల్లోకి వరద నీరు ఒక్కసారిగా చేరాయని.. నీటిలో చిక్కుకున్న 28 మందిని రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షింత ప్రాంతాలకు తరలిచామని కలెక్టర్ తెలిపారు. మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్‌కు వివరించారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని చెప్పారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ జితేష్ వివరించారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ స్పష్టం చేశారు.
పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆమె సూచించారు. భారీ వర్షాలు, వరదలతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని డీజీపీ జితేందర్ తెలిపారు. భారీ వర్షాలతో ఒక్కసారిగా 40వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు ఎత్తాల్సివచ్చిందని, ప్రస్తుతం వరద తగ్గిందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు. సీఈతో పాటు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

