Crime news | నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం.. ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు
Crime news | నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్‌ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్‌ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై బాధితురాలు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, బాలుడు ఫైజల్ ఖాన్ మిస్సయిన ట్రీట్మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు కొంచెం ఆటంకంగా మారింది. కాగా, బాలుడి తల్లి నుంచి ఓ మహిళ ఫైజల్‌ఖాన్‌ను తీసుకుని ఎత్తుకున్నదని, ఆమె భోజనానికి వెళ్లి తిరిగొచ్చే సరికి బాలుడితో సహా సదరు మహిళ పరారయ్యిందని తెలుస్తున్నది.
ఘటనకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తన బిడ్డకు
అనారోగ్యంగా ఉండటంతో గురువారం ఆస్పత్రికి తీసుకొచ్చామని, రాత్రి అకస్మాత్తుగా తన కొడుకు కనిపించకుండా పోయాడని బాలుడి తండ్రి, గండిపేట ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

