హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూ భూముల్లో చెట్ల తొలగింపు పనులను తక్షణమే నిలిపేయాలని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 400ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని బుల్డోజర్లతో చెట్లను తొలగించడం బాధాకరమని అన్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాని ఆదేశాలివ్వడం శుభపరిణామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా భూముల వేలాన్ని ఆపాలని హితవు పలికారు. ప్రభుత్వ తీరుమారకుంటే విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.