దేశంలో కొనసాగుతున్న ఆటవిక రాజ్యం: సీపీఐ నేత కూనంనేని
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీలను ప్రయోగిస్తుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారిపై ఒక్క దాడైనా జరిగిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు మూడు వేల ఈడీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వాటిలో ఒక్కటి కూడా నిరూపితం కాలేదని చెప్పారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన నేరస్తుడు పీఎం మోదీయేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అజ్ఞాని అని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్‌కు నోటిసులిస్తే ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావులాంటి వారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. సంతోష్ ఏమైనా దేవుడా.. నోటిసులిస్తే తప్పేంటని నిలదీశారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా విచారించాలని సిట్ అధికారులను విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

