CPGET results | సీపీగెట్ ఫలితాలు విడుదల.. క్వాలిఫై అయిన 93.42 శాతం అభ్యర్థులు
CPGET results | లంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 93.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 93.42 శాతం మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్ జేఎన్టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
కాగా, CPGET -2023 పరీక్షలను జూన్ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం cpget.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

