బూస్టర్ డోస్ తప్పనిసరి.. వైద్యనిపుణుల సూచన
కరోనా రీ ఎంట్రీతో మళ్లీ అందరి దృష్టి వ్యాక్సినేషన్‌పై పడింది. మొన్నటి వరకు బూస్టర్ తీసుకునేందుకు వెనుకంజ వేసిన జనం..
- రెండు బూస్టర్ల మధ్య 6-9 నెలల గ్యాప్ ఉండాలి
- సహజ యాంటిబాడీస్ వస్తే మరికొంత కాలం ఆగాలి
- ఎన్నిసార్లయినా తీసుకోవచ్చు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా రీ ఎంట్రీతో మళ్లీ అందరి దృష్టి వ్యాక్సినేషన్‌పై పడింది. మొన్నటి వరకు బూస్టర్ తీసుకునేందుకు వెనుకంజ వేసిన జనం.. ఇప్పుడు బీఎఫ్-7 వేరియంట్ కలకలంతో టీకా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే బూస్టర్ విషయంలో చాలా మందికి వివిధ రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వైరస్ తగ్గుముఖం పట్టింది కదా అని కొందరు.. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నందున ఇక బూస్టర్ ఎందుకని మరికొందరు.. అసలు బూస్టర్ డోస్‌ను ఎవరు, ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై మరికొందరు అయోమయానికి గురవుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్నవారు సైతం మరోసారి తీసుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.
18 ఏండ్లు దాటినవారంతా తీసుకోవచ్చు..
కరోనా వచ్చినా, రాకపోయినా మొదటి రెండు డోసులతో పాటు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలి. దీంతో ఆ వైరస్‌ను తట్టుకునే ప్రతిరక్షకాలు (యాంటిబాడీస్) శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత వైరస్ దాడిచేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. దవాఖానలో చేరాల్సినంత అవసరం రాదు. సాధారణంగా ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న కొంత కాలం తర్వాత యాంటిబాడీస్ తగ్గుముఖం పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలడంతో బూస్టర్ డోస్ తప్పనిసరి అయింది. 18 ఏండ్లు పైబడిన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. మొదటి రెండు డోసులు తీసుకున్న 6 నెలలకు బూస్టర్ తీసుకోవాలి. ఆ మధ్యలో కరోనా ఇన్ఫెక్షన్కు గురైతే మరో 3-4 నెలల గ్యాప్ ఇవ్వాలి.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
బూస్టర్ల మధ్య 6-9 నెలల గ్యాప్ ఉండాలి
ఒకసారి కొవిడ్ టీకా తీసుకుంటే దాని ప్రభావం 6 నుంచి 9 నెలలపాటు ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల మొదటి రెండు డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత తొలి బూస్టర్ డోస్ తీసుకోవాలి. ఆ తర్వాత 6-9 నెలలకు రెండవ బూస్టర్ తీసుకోవచ్చు. యాంటిబాడీస్ తక్కువగా ఉన్నవారు కచ్చితంగా బూస్టర్ తీసుకోవాల్సిందే. బూస్టర్ తీసుకున్న తర్వాత వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయితే మరో 5-6 నెలలు ఆగాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో సహజంగానే యాంటిబాడీస్ తయారవుతాయి. వీటితో ఎక్కువ కాలం రక్షణ ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఎన్ని టీకాలు తీసుకున్నా కరోనా జాగ్రతలను మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే.
– డాక్టర్ శివరాజు, సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్
ఏటేటా బూస్టర్ తీసుకోవడం ఉత్తమం
ఫ్లూ వ్యాక్సిన్ల మాదిరిగా ఏటా కరోనా బూస్టర్ టీకా తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం వైరస్ ఉనికి పూర్తిగా తొలగిపోనందున కనీసం మరో మూడు నాలుగు సంవత్సరాలపాటు ఏడాదికోసారి బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది. బూస్టర్ విషయంలో క్రాస్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మొదటి రెండు డోసులు ఒకే కంపెనీకి చెందిన టీకాలు తీసుకుంటే బూస్టర్‌గా వేరే కంపెనీ టీకా తీసుకోవాలి. తద్వారా ఎక్కువ యాంటిబాడీస్ ఉత్పత్తి కావడమే కాకుండా చాలా కాలంపాటు రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
– డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ఏఐజీ దవాఖాన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

