పత్తి రైతుకు ‘ధర’హాసం!
పత్తి రైతులకు ఈ ఏడాది కూడా మంచి ధర లభించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ సీజన్లో క్వింటాల్ పత్తి ధర రూ.8-12 వేల వరకు ఉంటుందని అంచనా.
- క్వింటా ధర 10 వేలు దాటే చాన్స్
- తొలికాత 8,199తో శుభారంభం
- మార్కెట్‌కు వస్తున్న కొత్త పంట?
- రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో సాగు
- 30 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పత్తి రైతులకు ఈ ఏడాది కూడా మంచి ధర లభించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ సీజన్లో క్వింటాల్ పత్తి ధర రూ.8-12 వేల వరకు ఉంటుందని అంచనా. రెండురోజుల క్రితం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తొలి కాత పత్తి క్వింటాల్‌కు రూ.8,199 పలికింది. డిసెంబర్ నాటికి సగటున రూ.10 వేలు దాటొచ్చని వ్యాపారుల అంచనా. నిరుడు కూడా క్వింటాల్ పత్తి ఓ దశలో రూ.13 వేల వరకు పలికింది. ఈ ఏడాది పొడవు గింజ రకపు పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380 కాగా మధ్యస్థ గింజ రకానికి రూ.6,080గా నిర్ణయించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మద్దతు ధర కన్నా సుమారు 70-80% అధిక ధర పలికే అవకాశం ఉన్నది. బహిరంగ మార్కెట్లోనే మద్దతుకు మించిన ధర లభించే అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే అవకాశం లేదని భావిస్తున్నారు. మొత్తం పంటను బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది. యూరప్‌లో ఆర్థికమాంద్యం నేపథ్యంలో డిసెంబర్ తర్వాత పత్తి ధర కొంత పడిపోయే అవకాశం ఉన్నదని పత్తి వ్యాపారులు చెప్తున్నారు. ఇదే జరిగితే అప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
ఉత్పత్తి అంచనా 30 లక్షల టన్నులు
ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి విత్తే కీలక సమయంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు పత్తి సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. లేదంటే సుమారు 70 లక్షల ఎకరాల వరకు సాగయ్యేది. ఈ ఏడాది సుమారు 30 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ఏడాది పత్తి సాగులో నల్లగొండ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 6.47 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఆదిలాబాద్‌లో 4.05 లక్షల ఎకరాల్లో సాగైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

