సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 12:18:47

రంగులతో జాగ్రత్త.. కరోనా నేపథ్యంలో గుంపులో ఉండొద్దు!

రంగులతో జాగ్రత్త.. కరోనా నేపథ్యంలో గుంపులో ఉండొద్దు!

రంగుల పండుగ హోలీ సంబురాల మాటున అపాయాలు పొంచి ఉన్నాయి. రసాయనాల వాడుక అధికంగా ఉండే నాసిరకం రంగుల వాడకం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ రంగులు.. కంటి చూపును దూరం చేసే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా నాసిరకం రంగు వాడకం కళ్లలో అల్సర్ (కంటిలో పుండ్లు)కు దారి తీస్తుందని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు హోలీ రంగులతో ఆడే సమయంలో సాధ్యమైనంత వరకు పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు.

మరోవైపు కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నేపథ్యంలో గుంపులు గుంపులుగా ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు.  ఒకవేళ కరోనా లక్షణాలు వ్యక్తి నీటిలో తడిసి గుంపులో ఉండటం వల్ల తుమ్ములు, దగ్గు ద్వారా మిగతా వారికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెయిన్‌ డ్యాన్స్‌లు చేసే వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హోలీ ఆడవద్దని.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్లు హెచ్చరించారు. 

జాగ్రత్తలు పాటిద్దాం..

* హోలీ ఆడే సమయంలో కంటిలో పడకుండా ఉండేందుకు ప్రొటెక్టివ్ గ్లాసెస్ (కంటి అద్దాలు) ధరించాలి

* ఘాటైన, కెమికల్ అధికంగా ఉండే రంగులకు దూరంగా ఉండాలి

* పెట్రోలియం ఉత్పత్తులతో తయారు చేసిన రంగులు.. సునేర్ వంటి వాటిని వాడొద్దు..

* కోడిగుడ్లను వాడొద్దు

* నీటిలో సునాయాసంగా కలిసిపోయే రంగులను మాత్రమే వినియోగించాలి

* నీటిని బలంగా ముఖంపై చిమ్మడం వంటి పనులు చేయరాదు

* రంగుల ఎలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి

* ప్రమాదవశాత్తు కంటిలో రంగు పడితే వెంటనే చల్లటి మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి

* రంగుల వల్ల కళ్ళు ఎర్రబడడం, నీళ్ళు కారడం వంటివి జరిగితే వెంటనే మడైల్ సెల్యులోజ్ లేదా టియర్ రీప్లేస్‌మెంట్ డ్రాప్స్‌లను గంటకు ఒకసారి వాడాలి

* అయినా కంటి సమస్య తగ్గకపోతే వెంటనే సమీపంలోని డాక్టర్‌ను సంప్రదించాలి


logo