డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రజలందరికి కరోనా టీకాలు
మంత్రి ఎర్రబెల్లి | డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రజలందరికీకి కరోనా టీకాలు వేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

వరంగల్ : డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకాలు వేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం ఆయన హంటర్ రోడ్, విష్ణుప్రియ గార్డెన్స్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్స్ కు ముందుగా టీకాలు ఇవ్వాలన్న సీఎం ఆలోచన బ్రహ్మాండమైందన్నారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కరోనా టీకాలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ కల్లా రాష్ట్ర ప్రజలందరికి టీకాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం 20 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. అర్హులందరు తప్పకుండా టీకాలు వేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల సత్పతితో, డీఎంహెచ్‌వో లలితా దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

